Those who are sexually harassing women workers in medical college should be punished severely
పోరాడి సాధించుకున్న మెడికల్ కళాశాలలో మహిళలపై వేధింపులు అరికట్టాలి
రాష్ట్రంలో రామగుండం మెడికల్ కళాశాల పరువు తీస్తున్న కామాంధులు
లైంగిక వేదింపులు జరగుతున్న పట్టించుకోని కాంట్రాక్టర్, ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
మెడికల్ కళాశాల ఆవరణలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి
స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక డిమాండ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మెడికల్ కళాశాలలో రోజురోజుకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో బుధవారం రోజున మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరిగింది.
అనంతరం సామాజిక కార్యకర్త మద్దెల దినేష్, కార్పొరేటర్ ఐత శివకుమార్, ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ గార్లు మాట్లాడుతూ గోదావరిఖనిలోని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున గతంలో పోరాటాలు చేసి సింగరేణి ద్వారా మెడికల్ కళాశాల సాధించుకుంటే అందరికీ నాణ్యత మైనటువంటి వైద్యం వైద్య విద్య, మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్న ఘనత ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలది అన్నారు.
అయితే మెడికల్ కళాశాల నిర్వహణ పూర్తి కావడంతో కాంట్రాక్టు విభాగంలో ఇతర ప్రాంతానికి చెందిన వారికి ఏజెన్సీ ద్వారా కాంట్రాక్ట్ అప్పగిస్తే పారిశుద్ధ్య విభాగం మరియు సెక్యూరిటీ విభాగం కాంట్రాక్టు తరఫున ఉద్యోగాల్లోకి తీసుకున్న తరుణంలో కొంతమంది అధికార పార్టీకి చెందినవారు కాంట్రాక్టు పద్ధతిన సూపర్వైజర్లుగా చేరి మాకు మంత్రి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తూ అధికార పార్టీని అడ్డం పెట్టుకుంటూ పనిచేస్తున్న స్థలాలలో మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ నానారకాలుగా వేధింపులకు పాల్పడటం సభ్య సమాజం తలదించుకునేలా చేయడం సరైన పద్ధతి కాదని, ఆడపిల్లలపై వేధింపులకు గురి చేస్తున్న కామపిశాచాల పైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నారు, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
గత రెండు నెలల క్రిందనే అందులో పనిచేసే సిబ్బంది రాసలీలకు పాల్పడుతూన్న తరుణంలో వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిందని, అయినప్పటికీ కూడా అటు కాంట్రాక్టర్ ఇటు ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
అది మరవకముందే మరొక సూపర్వైజర్ ఒక మహిళా పై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటని ఇంతవరకు కనీసం కాంట్రాక్టర్, ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆంతర్యం ఏమిటి అని వారు ప్రశ్నించారు?
సూపర్వైజర్లు, కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ కుమ్మక్కై మెడికల కళాశాలలో కష్ట పడి చిన్నాచితక పనులు చేసుకునే మహిళలను టార్గెట్ చేస్తూ వారు ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఉద్యోగాల నుండి తొలగించడం అలవాటు చేసుకున్నారని గత మూడు నెలల కింద ముగ్గురు ఆడపిల్లలను ఎందుకు తొలగించారు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి, వారికి ఎలాంటి రాజకీయ అండదండలు లేనందునే తొలగించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రిన్సిపల్ అందరిని సమానంగా చూడాలని రాజకీయ పార్టీ నాయకుల అండదండలు ఉన్న వారిని ఒక రకంగా, కాంట్రాక్టర్ను ఒక రకంగా,
లేబర్ లను ఒక రకంగా చూడడం మానుకోవాలని అదేవిధంగా కాంట్రాక్టర్ అర్హులైన వారిని తీసుకోవాలని అర్హత లేని వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకొని ఇలాంటి వాటికి పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతుందని వారు ఆరోపించారు అసలు మెడికల్ కళాశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సింగరేణి యాజమాన్యం దాదాపు 520 కోట్ల రూపాయలకు పైగా కార్మికులు కష్టపడి లాభాలు చేస్తే మెడికల్ కళాశాల కోసం డబ్బులు వెచ్చిస్తే ప్రతి రూపాయి కార్మికులకు కార్మికుల కుటుంబాలకు ఇక్కడి ప్రాంత ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
మరల ఆడపిల్లలపై ఇలాంటివి పునరావృతం అయితే పోలీసులు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి శిక్షలు విధించేలాగా చూడాలని వారు డిమాండ్ చేశారు.
శాసనసభ్యులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ మెడికల్ కళాశాల పైన మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మెడికల్ కళాశాల ఆవరణలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ మౌనం వీడాలని ఇలాంటి చర్యలను ప్రోత్సహించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని లేని యేడల ప్రిన్సిపల్ బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App