MLA Gorantla : బైక్ పై తిరుగుతూ ఎమ్మెల్యే గోరంట్ల హల్ చల్

TRINETHRAM NEWS

బైక్ పై తిరుగుతూ ఎమ్మెల్యే గోరంట్ల హల్ చల్

రోడ్లు, డ్రైన్ పనులు పరిశీలన…

మండలం కేంద్రమైన కడియం గ్రామం లో సోమవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బైక్ పై పర్యటించి సందడి చేశారు. ఎంపిపి వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, అధికారులు తో కలిసి ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని బైక్ పై కూర్చుని గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన పలు రోడ్లను, డ్రైన్ లను పరిశీలించారు. స్థానిక దేవిచౌక్ సెంటర్ నుండి పడాల వారి వీధి, చల్లా వారి వీధి, శెట్టిబలిజ పేట రామాలయం మీదుగా గ్రామంలో ప్రధాన వీధులు పరిశీలించారు.
గ్రామంలో మిగిలిన పలు అభివృద్ధి పనులకు తక్షణమే అంచనాలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని బైక్ పై తిరుగుతూ అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీ చేస్తూ సమస్యలు తెలుసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జెమ్మి, వనుం సూరిబాబు, తమ్మిశెట్టి ప్రసాద్, భీమన ప్రదీప్,వెన్నపు అయ్యప్ప, చిరుకూరి సుబ్బరాజు,నేలపూడి కింగ్,వరగోగుల వెంకటేశ్వరరావు, బొరుసు సురేష్, సిఐ ఎ.వెంకటేశ్వరరావు,డిఇ.రవి, పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top