జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 01 at 6.17.03 PM

TRINETHRAM NEWS

న్యూ ఇయర్ లాస్ట్ డే.. అందులోనూ డిసెంబర్ 31వ తేదీ ఆదివారం.. దీంతో ఎనిమిది మంది సభ్యులతో ఓ ఫ్యామిలీ అబిడ్స్ లోని ఓ హోటల్ కు వెళ్లింది. జంబో బిర్యానీ ఆర్డర్ చేసింది.. తీరా బిర్యానీ వచ్చిన తర్వాత.. బిర్యానీ సరిగా ఉడకలేదు.. గట్టిగా ఉంది.. బాగోలేదు అంటూ ఆ ఫ్యామిలీ వెయిటర్లతో చెప్పింది.. అంతే సరైన ఫుడ్ పెట్టకపోగా.. ఆ ఫ్యామిలీపైనే.. ఆ హోటల్ సిబ్బంది దాడి చేసి కొట్టటం హైదరాబాద్ సిటీలో సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ 31న రాత్రి 8 మంది కుటుంబ సభ్యులు అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. జంబో బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ వడ్డించిన తర్వాత అన్నం సరిగా ఉడకలేదని.. వాళ్లు వెయిటర్ కు చెప్పారు. దీంతో వెయిటర్ వారికి సరైన ఆహారం పెట్టకపోగా వారితో వాగ్వాదానికి దిగారు. బిల్లు కట్టేటప్పుడు హోటల్ సిబ్బందితో ఈ వాగ్వాదం మరింత ముదిరింది. దీంతో వెయిటర్లు, ఇతర వస్తువులతో ఆ కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

You cannot copy content of this page