జూన్ 26, 2026

IMG 20250131 WA0035

TRINETHRAM NEWS

దొంగలేడి కిలాడి దొరికింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బంగారాన్ని టార్గెట్ చేస్తుంది, ఎవరికి దొరకకుండా పారిపోతుంది.
వికారాబాద్ జిల్లా పరిగి రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే కిలాడీ లేడీని పట్టుకున్న పోలీసులు.భువనగిరికి చెందిన అమూల్య అనే మహిళ, హైద్రాబాద్ కు చెందిన మహ్మద్ ఇక్బాల్ ఇద్దరు కలిసి రద్దీ ప్రాంతాల్లో దొంగ తనాలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో గుర్తించిన పోలిసులు.

కిలాడి లేడీ అమూల్యను పోలిసులు అరెస్టు చేయగా పరారీలో మరో నిందితుడు మహ్మద్ ఇక్బాల్.అమూల్య వద్ద నుండి దాదాపు 11 తులాల బంగారం, 80 వేల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం.ఈ నెల మొదటి వారంలో పరిగి బస్టాండ్ లో జరిగిన చైన్ స్నాచ్చింగ్ కేసులో దర్యాప్తు చెయ్యగా బయట పడ్డ కిలాడి లేడీ బాగోతం.గతంలోను వీరిరువురూ కలిసి జిల్లాలో పలుచోట్ల చోరీలు.చోరిలే తమ వృత్తి అని పోలీసుల విచారణలో తెలిపిన మహిళ.మహ్మద్ ఇక్బాల్ ప్రధాన సూత్రధారిగా ఉంటూ చోరీలు ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలో ట్రైనింగ్ ఇచ్చేవాడని పోలీసులకు తెలిపిన మహిళ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page