సంపూర్ణ ఆరోగ్యముతో పదవీ విరమణ పొందడము దేవుడిచ్చిన వరం

TRINETHRAM NEWS

సంపూర్ణ ఆరోగ్యముతో పదవీ విరమణ పొందడము దేవుడిచ్చిన వరం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అనేది గొప్ప విషయం. – జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి,IPS. సుధీర్గ కాలంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్‌ఐలు మీర్ ఫయాజ్ అలీ, జీవరత్నంల పదవి విరమణ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ K. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శాలువా, జ్ఞాపికలతో సత్కరించి భాజా భజయింత్రులతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.

పదవి విరమణ పొందుతున్న మీర్ ఫయాజ్ అలీ, జీవరత్నం లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ నందు పోలీస్ కానిస్టేబుల్ గా భర్తీ అయి హెడ్ కానిస్టేబుల్ ఏ‌ఎస్‌ఐ మరియు ఎస్‌ఐలుగా పదోన్నతి పొంది పోలీస్ డిపార్ట్మెంట్ నందు పలు పోలీస్ స్టేషన్స్ లలో పలు రకాలుగా విధులు నిర్వహించారుఇట్టి కార్యక్రమములో జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉధ్యోగులకు పదవీ విరమణ అనేది తప్పక ఉంటుంది, ఇద్దరు అధికారులు విధుల పట్ల అంకిత భావముతో ఉండి వారి యొక్క పూర్తి సర్వీస్ కాలములో ఎటువంటి రిమార్క్స్ లేకుండా, సంపూర్ణ ఆరోగ్యముతో పదవీ విరమణ పొందడము అనేది గొప్ప విషయం,పోలీస్ డిపార్ట్మెంట్ నందు పని చేస్తూ రిటైర్మెంట్ అయిన అధికారులు కూడా పోలీస్ కుటుంబం లో భాగమే,

పదవి విరమణ పొందిన అధికారులకు ఏదైనా అవసరం ఉన్న నేరుగా సంప్రదించి మాట్లాడాలని, సుధీర్గ కాలంగా పోలీస్ డిపార్ట్మెంట్ నందు విధులు నిర్వహించి ప్రజలకు సేవ చేయడం దేవుడు ఇచ్చిన వరం అని, ఇకముందు అధికారులు తదుపరి జీవితమును కూడా తమ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషలతో గడపలని, పోలీసు శాఖ నుండి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ లను అందించడం జరుగుతుంది అని, పదవి విరమణ పొందుతున్న ఇద్దరు అధికారులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపినారు.ఇట్టి కార్యక్రమం లో ఏ‌ఓ జ్యోతిర్మని ,ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేష్ ,డి‌ఎస్‌బి ఇన్స్పెక్టర్ డి‌వి‌పి రాజు పి‌సి‌ఆర్ ఇన్స్పెక్టర్ , ఆర్‌ఐ లు,ఎస్‌ఐ లు, జిల్లా పోలీస్ ప్రసిడెంట్ అశోక్ , డి‌పి‌ఓ సిబ్బంది మరియు పదవి విరమణ పొందుతున్న అధికారుల కుటుంబ సభ్యులు,బందుమిత్రులు తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top