బాక్సైట్ జోలికొస్తే తరిమి కొడతాం – ఆదివాసీ గిరిజన సంఘం బాల్ దేవ్
అరకులోయ ఫిబ్రవరి 18, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ అరకు,చింతపల్లి అటవి ప్రాంతం ఆరు బ్లాక్ లో 615 మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలు త్రవ్వకాలు జరిపే అధికారం కల్పించాలని లేదా వేలం వేసే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వనికి రాష్ట్ర ఖనిజభివృద్ధి సంస్థ కోరుతు నివేదిక సమర్పించిందని బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్రకూటమి ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు,జీవన విధానం, పర్యావరణనికి తీవ్ర హాని తలపెట్టే రాష్ట్ర ఖనిజభి వృద్ధి సంస్థ నివేదికను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గత 20 ఏళ్లుగా ఆదివాసీలు,గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాడిన ఫలితంగా బాక్సైట్ తవ్వకాల జీఓలు గత ప్రభుత్వాలు రద్దు చేసి నప్పటికీ ఆన్ రాక్, రస్ ఆల్ ఖైమా వంటి బడా కార్పొరేట్ సంస్థలతో చేసుకున్న అక్రమ ఒప్పందాలు రద్దు చేయలేదని ఆన్ రాక్ కంపెనీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయని ఊరట లభించకపోవడంతో లండన్ ఆర్బిటేషన్ కోర్టులో వాజ్యం దాఖలు చేసిందని 2026 మార్చి 26 విచారణ జరగనున్న నేపథ్యంలో బాక్సైట్ తవకాల అంశం మరోపై తరిమిదికొచ్చిందని మరో జన్మ ఉంటే ఆదివాసి ప్రాంతంలో పుడతానని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసి ప్రాంతాన్ని విధ్వంసం చేసే బాక్సైట్ అక్రమ ఒప్పందాలు ఖనిజభివృద్ధి సంస్థ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని ఆదివాసులకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు అక్రమ ఒప్పందాలు జారీచేసిన జీఓలు 2,13,51 రద్దు చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేంద్ర మైనింగ్ విధానంలో మార్పులు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అపారమైన సహజవనరులు బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు బాక్సైట్ తవ్వకాలు జరపాలని వేలం పాటలు వేసే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వనికి ఖనిజభివృద్ధి సంస్థ నివేదిక ఇచ్చిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఆదివాసుల హక్కులు,చట్టాలు ఉల్లంఘించి పర్యావరణము తీవ్ర హాని కలిగించే ఆదివాసుల జీవనం ధ్వంసం చేస్తున్న బాక్సైట్ తవ్వకాల కుట్రను ఆదివాసీ ప్రజలు తిప్పి కొట్టాలని ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన ఆర్గానిక్ కాఫీ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు,అనంతగిరి,చింతపల్లి ప్రాంతంలో బాక్సైట్ నిక్షేపాలు ఉన్న కొండల్లోనే ఆర్గానిక్ కాపీ పంట ఉందని బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఆదివాసి జీవన విధానంతో పాటు కాఫీ తోటలు పంట పొలాలు విధ్వంసం అవుతాయని తక్షణమే కనిజభివృద్ధి సంస్థ ఇచ్చిన నివేదికను రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ అన్రాక్ కంపెనీతో చేసుకున్న పాత ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది లేనిపక్షంలో మరో బాక్సైట్ పోరాటం చైనాక్లే, హైడ్రో పోరాట తరహాలో పోరాటాలు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సివ్వేరి కొండలరావు జిల్లా నాయకులు సత్యనారాయణ, హైడ్రో పవర్ ప్రాజెక్టు కమిటీ కన్వీనర్లు, మాజీ ఎంపీటీసీ దశరద్, సురేష్, కృష్ణంరాజు, నోబో, పెసా కమిటీ సభ్యులు సోనియా, సురేష్ కుమార్, బాలరాజు శ్రీరామ్, మనోజ్, మధు, సింహాద్రి,చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


