BC Reservations : బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి వీడాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : క్యాబినెట్ లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి అఖిలపక్షంతో సీఎం ఢిల్లీకి వెళ్లే తేదీని ప్రకటించాలీ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికల నిర్వహించాలి
ఈనెల 11న బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబించకుండా రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో స్పష్టతనివ్వాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి అఖిలపక్ష తేదీని క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
స్థానిక ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు కొద్ది సమయమే ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తమ చర్యల్ని వేగవంతం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జీవోల పేరుతో కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు
ఇటీవల హైదరాబాద్ పర్యటనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కరిగే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల సమక్షంలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జరిగిన సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారని కానీ ఇందుకు విరుద్ధంగా ప్రతిరోజు మీడియాలో ఒకరోజు జీవో అని ఇంకొక రోజు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వస్తున్నందున తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు గందరగోళానికి గురవుతున్న దృశ్య ఈ గందరగోళానికి తెరదించాలంటే రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీలు బాధ్యత తీసుకోవాలని బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం చేయకుండా నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరించి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఈనెల 11వ తేదీన హైదరాబాదులో బిసి కుల సంఘాలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The state government should

You cannot copy content of this page

Scroll to Top