వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను పరిశీలించాలని, మార్పులు చేర్పులపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సమస్తలు సుదీర్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండలంలోని మున్సిపాలిటి కార్యాలయం లో ఎలక్షన్ కమిషన్ దేశాల మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు జాతీయ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఫారం 6, 7,8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటర్ జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలు తొలగించి, ఓటర్ల నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులను సవరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించాలన్నారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేయాలని కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు నమోదు అయ్యేలా చూడాలని బూత్ లెవెల్ అధికారులకు సూచించారు. మరణించిన వారి పేర్లను తొలగించేందుకు నిబంధనలు పాటించి ఫారం 7 ద్వారా తొలగించాలని, మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని తెలిపారు. షిఫ్టింగ్, పేరు మార్పిడిలు కొరకు ఫారం 8 వినియోగించాలన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో తహసిల్దార్లక్ష్మీనారాయణ , డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్, బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


