Bandaru Satyananda Rao : స్వాతంత్ర్య సమర నినాదం వందేమాతరం

TRINETHRAM NEWS

మరో వెయ్యేళ్ళయినా వందేమాతరం స్ఫూర్తి రగులుతూనే ఉంటుంది…

కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు….

త్రినేత్రం న్యూస్ నవంబర్, 07. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట.. మరో వెయ్యేళ్ళు గడిచినా భారతీయుల్లో వందేమాతరం గీతం స్పూర్తి అలాగే నిల్చి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించి శుక్రవారానికి 150 సంవత్సరాలు పూర్తి కావడంతో వాడపాలెం పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.విద్యార్థులతో కల్సి వందేమాతరం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్ర్య సమర నినాదం వందేమాతరం అని కొనియాడారు.

1875 నవంబర్ 7వ తేదీన ఈ గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించారని తెలిపారు. స్వాతంత్రం వచ్చాక 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందేమాతరం గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గీతంగా గౌరవించిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని నేడు మనం జరుపుకుంటున్నారన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The slogan of the freedom struggle is Vande Mataram

You cannot copy content of this page

Scroll to Top