Chairperson Rani : పట్టణ సుందరీకరకణ కు ప్రాధాన్యత

TRINETHRAM NEWS

చైర్ పర్సన్ రాణి

త్రినేత్రం న్యూస్, నవంబర్, 07. మండపేట పట్టణ సుందరీకరణ కు ప్రాధాన్యత ఇస్తున్నామని మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట పట్టణం ఆలమూరు రోడ్డు వైపు స్వాగత ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫౌంటైన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శుక్రవారం అధికారులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ సుందరికరణ చర్యల్లో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులు రూ.18 లక్షల తో పనులు చేపట్టామన్నారు.నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ కింతాడ శ్రీనివాసు,ఏ.ఈ దాసరి పవన్ లు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Priority given to urban beautification

You cannot copy content of this page

Scroll to Top