సమాచార హక్కు చట్టం 2005 సమాచార అధికారుల నోటీస్ బోర్డులో పేర్లు మారలే?
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరాకోరా వసతులు
నిమ్మకు నీరెత్తినట్లు మండలవిద్యాశాఖ అధికారులు.
తూ తూ మంత్రంగా తనిఖీలు.
డిండి గుండ్ల పల్లి జులై 20 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది సమాచార హక్కు చట్టం 2005 సమాచారం కొరకు అధికారుల పేర్లు గత ప్రభుత్వంలో పని చేసిన అధికారుల పేర్లు నోటీసు బోర్డుపై ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వం 18 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటి వరకు సమాచారకు హక్కు చట్టం 2005 నోటీస్ బోర్డ్ పై నవీకరణ చేయలేదు.
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పేర్లను మార్చకుండా అలాగే ఉంచి విద్యార్థుల జ్ఞాపకశక్తి ని పెంపొందించకుండా .. విద్యార్థులను ఎవరైనా మన ముఖ్యమంత్రి ఎవరు? మనవిధాశాఖాధికారి ఎవరు ? మనజిల్లా విద్యాశాఖాధికారి ఎవరు అని విద్యార్థులను ఎవరైనా ప్రశ్నిస్తే బోర్డులో వున్న పాత పేర్లు చెప్పడం విడ్డూరం. మండల విద్యాశాఖ అధికారి ఏం చేస్తున్నట్లు.? ఎవరైనాఅధికారిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానాలుఇస్తున్నారని ప్రజలువాపోతున్నారు .మొద్దు నిద్రపోతున్న విద్యా వ్యవస్థ.
ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ని సమస్యలను, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరై తమ విధులను సక్రమంగా నిర్వహించేటట్లు, చూస్తారని స్థానిక ప్రజలు జిల్లా విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


