MLA Vegulla Jogeswara : రైతులకు మెరుగైన సేవలు అందించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాలసీమ జిల్లా, మండపేట, సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మండపేట మండలం, జెడ్ మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు. అధ్యక్షులుగా సలాది బాలసుబ్రమణ్యం, సభ్యులుగా సంగిశెట్టి అమ్మన్న, బోయిడి వెంకటరమణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ కూటమి నాయకులు, రైతులతో కలసి నూతన కమిటి సభ్యులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, జడ్ మేడపాడు సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, సొసైటీ కార్యదర్శి రామకృష్ణ, మండపేట మండల టీడీపీ మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జి, గోణం పుల్లయ్య, సత్తి సత్యనారాయణ, పల్లా వీరబాబు, తులా విష్ణు, చింతా దొరబాబు, కుంచె ప్రసాద్, తానంకి చంద్రశేఖర్, అడబాల బుల్లబ్బు, కంకటాల మురళీకృష్ణ, పంతంగి బోసు, పంతంగి ఉమామహేశ్వరరావు, వర్రే వీరబాబు, యరగతపు గణేష్, యాదగని గోవిందు, మండా లక్ష్మీ వీరభద్రరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farmers should be provided

You cannot copy content of this page

Scroll to Top