జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 2.16.33 PM

TRINETHRAM NEWS

సమాజ మార్పు లో మహిళల పాత్ర కీలకం.

మార్పు కోసం ముందుకు వచ్చిన మహిళలకు అభినందనలు.

  • షేక్. అబ్దుల్ అజీజ్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు

నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజ్ నందు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ 40, 42, 43, 45 డివిజన్ ల మహిళా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, సమాజంలో మార్పు రావాలంటే అత్యధిక శాతం మహిళలతోనే సాధ్యమవుతుందని, మార్పులో కీలక పాత్ర మహిళలదేనని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఈ పరిస్థితులను మార్చే బాధ్యత ను ప్రతి మహిళా ఏదో ఒక రూపంలో తీసుకోవాలని అన్నారు. మార్పు కోసం ముందుకు వచ్చి టీడీపీ తో పని చేస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. రాక్షస పాలన గురించి, రాష్ట్రానికి చంద్రబాబు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించి రాష్ట్ర పరిస్థితుల మార్పు కు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, జాఫర్ షరీఫ్, పుట్టా అజయ్, జాఫర్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page