పెద్దపల్లి, జూలై 14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన ఆర్. తిరుపతి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులో ఉన్న చిన్న కుంట చెరువు శిఖం భూమి కొందరు గ్రామస్తులు కబ్జా చేసి వారి పేరు నమోదు చేసుకొని అక్రమంగా అమ్ముకుంటున్నారని, పందిళ్ళ శిఖం భూమి పరిశీలించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కాల్వ శ్రీరాంపూర్ కు రాస్తూ విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తండ గ్రామం మాజీ సర్పంచ్ & గ్రామస్తులు తమ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారుల జాబితా విడుదల చేయలేదని, గ్రామానికి సంబంధించిన అర్హుల జాబితా విడుదల చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సంబంధిత అధికారులకు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామానికి చెందిన జి.
సదయ్య తాను దివ్యాంగుడినని తనకు గతంలో అంత్యోదయ బియ్యం కార్డు ఉండేదని 30 కోట్ల బియ్యం వచ్చేదని ప్రస్తుతం రావడం లేదని, తనకు 30 కేజీల అంజి ఉదయ కార్డు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


