దేవరకొండ ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసిన, కుట్రలు కుతంత్రాలు పన్నిన, వాటిని ఎదుర్కొని, తమదైన శైలిలో ముందుకు పోయి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నల్గొండ జిల్లా నాయకులు కార్యకర్తలకు బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పేరుపేరునా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
దేవరకొండ నియోజకవర్గం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో ఓటింగ్ పుట్టింది అని అందుకే అడుగడుగునా పోలీస్ ఆంక్షలు నిర్బంధాలు ప్రయోగించి అవాంతరాలు సృష్టించిన దుర్మార్గపు సర్కార్ అని ఆయన అన్నారు.
సభా ప్రాంగణానికి చేరకుండా కార్యకర్తలను 20 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయినా కార్యకర్తల్లో కాలినడకన పరుగు పరుగున సభకు చేరిన బిఆర్ఎస్ శ్రేణులు అని, ఎన్ని దారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్న వందలాది వాహనాలను తెప్పి పంపారని ఆయన తెలిపారు.
ఈ ఈ సమావేశంలో ఆంజనేయులు రవికుమార్, శ్రీనివాస్ గౌడ్ ,రాజు ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


