ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .
దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని శకృ తండాలో 10లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మరియు మైనంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును అధికారులు,ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన దేవరకొండ శాసన సభ్యులు *నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు.
గత పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, PACs చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్ నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, ఎంపిడిఓ డానియల్, స్పెషల్ ఆఫీసర్ శంకర్,మాజీ సర్పంచులు పాండు నాయక్,ఆంజనేయులు,శ్రీను నాయక్,శంసిర్ ఆలీ, లక్ష్మణ్ నాయక్,అంజయ్య,వెంకటయ్య,మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


