జూలై 17, 2026

WhatsApp Image 2025 01 28 at 18.23.30

TRINETHRAM NEWS

మారుపేరుల సమస్య పరిష్కరించి డిపెండెంట్ లకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి,

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణిలో గత కొంతకాలంగా మారుపేరుల సమస్య పరిష్కరిస్తామని కాలయాపన చేస్తూ ఇప్పటివరకు పరిష్కరించకుండా కారుణ్య నియామకాల ద్వారా దిగిపోయిన మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రాక విజిలెన్స్ ఎంక్వేర్ల పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న యజమాన్యం తక్షణమే మారుపేరుల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు, ఇప్పటికే కార్మికుల పిల్లలు తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక కార్మిక కుటుంబాలు మనస్థాపం చెంది ప్రాణార్పణ చేసుకుంటామని ప్రకటన చేస్తున్నారని తెలియజేశారు, అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు గుర్తింపులో ఉన్న కార్మిక సంఘాలు తక్షణమే డిపార్ట్మెంట్ల మారుపేరుల సమస్య పరిష్కరించి ఉద్యోగాలు వచ్చే విధంగా యజమానులతో మాట్లాడే చర్యలు తీసుకుంటామని ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇప్పటివరకు పరిష్కారం కాలేదని పిల్లలు ఆవేదన గురవుతున్నారని ఇలాంటి పరిస్థితులలో, గెలిచిన కార్మిక సంఘాలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో సింగరేణి యజమాన్యంతో మాట్లాడి పరిష్కరించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో సింగరేణి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పుడున్న
ఈ పరిస్థితులలో యాజమాన్యంతో పోరాడాలి తప్ప తొందరపడి ఎలాంటి ఆగత్యాలకు పాలు పడకూడదని కార్మికుల పిల్లలకు డిపెండెంట్ లకు విజ్ఞప్తి చేశారు మారుపేర్ల సమస్య పరిష్కరించే అంతవరకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) వెన్నుదన్నుగా నిలుస్తుందని ఐక్య పోరాటాలకు నాంది పలికేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు,
ఈ మీడియా కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు పాల్గొన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page