జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 16.28.46

TRINETHRAM NEWS

డంపింగ్ యార్డ్ వేరే ప్రాంతీనికి మర్చి మా ప్రాణాలు కాపాడండి అని ధర్నా చేసిన ప్రజలు

జనవరి27 త్రినేత్రం న్యూస్ హనుమకొండ ప్రతినిధి

హనుమకొండ కలెక్టరేట్ కాజిపేట్ మండలం గ్రామం మడికొండ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగించాలని మడికొండ రాంపూర్ చుట్టూ పక్కల ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలు ఇవ్వాళా హనంకొండ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు ధర్నా లో పాల్గొన బాధితులు మట్టాడుతూ ఈ డంపింగ్ యార్డ్ వలన చుట్టూ పక్కలా ఉన్న మా నీవాసలకు విష వాయువులు తొ కూడిన పొగ వలన ఎంతో మంది అనారోగ్యానికి గురి అవుతున్నామని వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది

ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారులుకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ప్రజా ప్రతినిధులు వాగ్దానాలకే పరిమితం అయ్యారు అని వెంటనే కలెక్టర్ చోరువ తీసుకొని డంపింగ్ యార్డ్ ను జన నివాసలు లేని నిర్మానుష ప్రాంతానికి మార్చాలని లేని యడల చుట్టూ పక్కల గ్రామల ప్రజల తొ పెద్ద ఎత్తున్న ధర్నాలు లు నిరహర దీక్షలు చేస్తాము అని అన్నారు ఈ కార్యక్రమం లో మడికొండ గ్రామనికి చెందిన మడ్డి రాజారామ్ గౌడ్ కరుణాకర్ రెడ్డి పెళ్లి కృష్ణ మూర్తి స్వామి పనిగంటి వెంకట్ రావు బొల్లికుంట వినోద్ కుమార్అక్కిపెల్లి ఉప్పెందర్ దువ్వ శ్రీకాంత్ రాంపూర్ గ్రామం నుండి మునిగాలా బాబు మునిగాలా మహేష్ మునిగాలా యాకుబ్ ఆరెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page