జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 16.42.44

TRINETHRAM NEWS

రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం సురక్షితంగా గమ్యాన్ని చేరుదాం : బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

బెల్లంపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బెల్లంపల్లి ఎసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బందితో కలిసి సిఈఆర్ క్లబ్ మనమర్రిలో ఆటో డ్రైవర్లకు, ప్రైవేట్ పాఠశాలల వ్యాన్ డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు,ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మంచిర్యాల బృందం వారు పాల్గొని తమ పాటల ద్వారా వాహనదారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు దాటేవారు తప్పకుండా ఒక్క అక్షరం ఆగి చూసి రోడ్డు దాటాలని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనాలు నడపాలని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబం మొత్తం పై ప్రభావం చూపుతుందన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, సూచించారు. లాంగ్ డ్రైవ్ చేసే డ్రైవర్లు విశ్రాంతి ప్రదేశాలలో వాహనాలు ఆపుకొని విశ్రాంతి తీసుకుని సమయస్ఫూర్తిగా వాహనాలు నడపాలని తెలిపారు. పెద్ద పెద్ద వాహన డ్రైవర్లు వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే పార్కు చేయాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలు పార్కు చేసేటప్పుడు పార్కింగ్ లైట్లు తప్పకుండా వేయాలని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయాలలో రోడ్లపై వాహనాలు నిలపవద్దని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ మజీద్, పోలీస్ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, మరియు వాహనదారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page