Ramavat Ravindra Kumar : స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎం ఎల్ ఏ,జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ….స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి అని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు.ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారు అని ఆయన తెలిపారు.రైతు బోనస్ బోగస్ చేశారు, 1300 కోట్లు పెండింగ్ లో పెట్టారు.నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్న మాట నీటి మూటలేయ్యాయి అని ఆయన తెలిపారు. పింఛన్లు పెంచడం దేవుడెరుగు, ఉన్న పింఛనల్లో కోత విధించారు అని ఆయన తెలిపారు.అభయహస్తం మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన గ్యారెంటీలోని మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు రూ.2500 గురించి ప్రస్తావన లేదు అని ,చివరి గ్యారెంటీ చేయూతలో చెప్పిన రూ.4000 పింఛన్ గురించి ఒక్క మాట లేదు.ఇగ 420 హామీలకు దిక్కే లేదు అని అన్నారు.పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగింది అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు , అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

win in the local body elections

You cannot copy content of this page

Scroll to Top