వృద్ధురాలుని ముక్కలుగా చేసి పెనకచర్ల డ్యామ్ లో!

TRINETHRAM NEWS

అనంతపురం జిల్లా.

గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో దారుణం చోటు చేసుకుంది.

బంగారం కోసం గ్రామానికి చెందిన ఓబులమ్మ(84)ను దారుణంగా హత్య చేశారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఆమె కుమార్తె హైదరాబాద్లో స్థిరపడింది.

ఇటీవల అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం దాదాపు 7 తులాల బంగారు నగలను ఓబులమ్మ ఇచ్చింది.

15 రోజులు గడిచినా వారు తిరిగి ఇవ్వకపోవడం స్థానికులను ఆశ్రయించింది.

దీంతో ఆగ్రహించిన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆమెతో ఘర్షణకు దిగి గొడ్డలితో నరికి చంపారు.

శరీర భాగాలను ముక్కలు చేసి పెనకచర్ల డ్యామ్లో పడేశారు. వృద్ధురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంఘటనా స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ బాషాలు పరిశీలించా పెనకచర్ల డ్యామ్ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు..

You cannot copy content of this page

Scroll to Top