జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 22 at 12.45.34

TRINETHRAM NEWS

సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ నిమిత్తం ఆయన తరఫున ఆప్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. కాసేపట్లో సీజేఐ ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.

వాస్తవానికి ఇలాంటివి సినిమాల్లోనే మనం చూస్తున్నాం. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. లా చదవని ఆయన కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారనే అనుమానాలు కలగడం సహజం. అయితే.. పార్టీ ఇన్ పర్సన్‌గా కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు.

పార్టీ ఇన్ పర్సన్‌ ఒక కేసులో సొంతంగా వాదించుకునేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. పార్టీ ఇన్ పర్సన్‌గా ఉండాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. స్టాంప్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు.. ఇలా కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. ఒక అప్లికేషన్‌ సమర్పిస్తే.. మీకు ఆ అర్హత ఉందని భావిస్తే దానికి కోర్టు అనుమతిస్తుంది.

అయితే అవగాహన లేకున్నా సాధారణంగా అడ్వకేట్ల మీద నమ్మకం లేకనో, లేకుంటే అడ్వకేట్ల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దరఖాస్తులు సమర్పించి కోర్టు అనుమతులతో వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో.. చట్టాల గురించి తెలిసి ఉండి.. తమ కేసును తామే వాదించుకోగలమన్న నమ్మకం ఉన్నప్పుడు పార్టీ ఇన్‌ పర్సన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కేజ్రీవాల్‌ ఇప్పుడు అలానే దరఖాస్తు చేసుకుని.. ఆ అనుమతితో వాదించుకోబోతున్నట్లు తెలుస్తోంది.

You cannot copy content of this page