జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 22 at 18.00.54

TRINETHRAM NEWS

ఈ రోజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి,మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి తుమ్మల నాగేశ్వర రావు మరియు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంత్ రావు,సుధీర్ రెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి లు మరియు మల్కాజిగిరి పార్లమెంట్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ నుండి రేవంత్ రెడ్డి ని గెలిపించి ఇక్కడి ప్రజలు ఒక మహోన్నతమైన కార్యాన్ని మొదలు పెట్టారని,దాని వల్ల నేడు మన రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ వదిలిపెట్టడానికి రేవంత్ రెడ్డి కి వెయ్యి ఏనుగుల బలం చేకూరి నేడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడంలో ప్రధాన పాత్ర పోషించారని,అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్త సునీతా మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుునిచ్చారు.

You cannot copy content of this page