Gram Sabha : బిక్కవోలు మండల అధికారులకు కాపవరం గ్రామ సభ తీర్మానాన్ని నాయకులు అందచేసారు.

TRINETHRAM NEWS

త్రినేత్రంన్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, రాష్ట్ర ప్రభుత్వం కాపవరం గ్రామంలో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆ‌లోచనను వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు చేసిన గ్రామ సభ తీర్మానం కాపీలను బిక్కవోలు మండల తహసీల్దార్ కి, ఎండిఓ కి కాపవరం గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకట రమణ, ఎంపీటీసీ మారెళ్ళ భీష్ముడు, అందచేసారు.

జిల్లాలో మొత్తం చెత్త తెచ్చి మా గ్రామంలో కరెంట్ తయారు చేస్తామంటే ఒప్పుకునేది లేదని గ్రామస్తులంతా ఒకేమాట మీద ఉన్నారని సర్పంచ్ వెంకట రమణ, అధికారులతో చెప్పారు.

ఈనెల 10 వ తారిఖున కాపవరం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేస్తే అధికారులు, పోలీసులు
వేసిన టెంట్ల, కుర్చీలను బలవంతంగా తీసి వేయించారని అయినా సరే గ్రామ సభ నిర్వహించి ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని గ్రామ సభ తీర్మానం ద్వారా ఆమోదించి మండల అధికారులకు ఇవ్వడం జరిగిందని, ఇదే కాపీలను జిల్లా అధికారులకు కూడా ఇస్తామని సర్పంచ్ వెంకటరమణ, ఎంపీటీసీ భీష్ముడు చెప్పారు.

కాపవరం గ్రామాన్ని కాపాడుకునేందుకు గ్రామ ప్రజలతో కలిసి ఎంతటి ఉద్యమం చెయ్యటానికి అయ్యిన వెనకాడేది లేదని వీరిద్దరూ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kapavaram Gram Sabha resolution

You cannot copy content of this page

Scroll to Top