ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసారు….
కోన రఘుపతికి అసలు బాపట్లలో టికెట్ లేకపోతే టికెట్ ప్రకటించేలా కృషిచేసిన వ్యక్తి వైఎస్ షర్మిల రెడ్డి .. ఇవన్నీ నీవు మర్చిపోయి షర్మిల రెడ్డి పై నీవు చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు…. కాంగ్రెస్ పార్టీ కన్ను ఎర్ర చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు….
వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాబట్టి నిన్ను వదిలేసాను అని ఎమ్మెల్యే కోన అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నేతలమైన మేమంతా కాలర్ ఎగరేసుకొని బాపట్లలో తిరుగుతున్నాము మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే కోన రఘుపతి…..
మహిళలపై, దళితులపై, చిన్న చూపు చూస్తే నిన్న ఊరుకోము ఖబడ్దార్ రఘుపతి ఇదే నీకు చివరి హెచ్చరిక… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ధోనిపూడి దేవరాజ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు పఠాన్ రాజేష్, శంకర్ రెడ్డి, బక్క రోశయ్య, దండు రేణుక, బన్నీ, తదితరులు పాల్గొన్నారు…