MLA KP Vivekananda : వైభవోపేతంగా ” శ్రీ కామాక్షి సమేత ఏకామ్రనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ నవగ్రహ పునఃప్రతిష్టాపన” మహోత్సవం

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ లోని శ్రీ కామాక్షి సమేత ఏకామ్రనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన నవగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్ గార్లు ఏకామ్రనాథ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అతి మహిమాన్వితమైన ఏకామ్రనాథ స్వామి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. భక్తి, శ్రద్ధలతో నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించినట్లయితే విఘ్నాలు తొలగి శాంతి, సుఖ సంతోషాలు లభిస్తాయన్నారు.

అంతకముందు నవగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ కి, మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్ గార్లకు రుత్వికులు మహా పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మాణిక్య నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బి.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్, ఖలీల్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, జయేందర్ రెడ్డి, మధు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, నాగరాజు, ఆలయ కమిటీ సురేష్, సలహాదారులు రామేశ్వర్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, నారాయణ రెడ్డి, బీమప్ప, దామోదర్ రెడ్డి, కాలనీ సీనియర్లు కెబిఆర్ ప్రసాద్, డి.పోచయ్య, గోపాల్ రెడ్డి, రాంరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు మధు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, చింతల్ డివిజన్ సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, కాలనీ వాసులు శ్రీధర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"Sri Kamakshi Sametha Ekamranatha Prasannanjaneya Swamy Temple

You cannot copy content of this page

Scroll to Top