Trinethram News : కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో మత్స్య శాఖ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో, ప్రభుత్వం తరపున 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా పంపిణీ చేసిన 1,50,000 ఒక లక్ష యాబై వేల చేప పిల్లలనుTSFCOF చైర్మన్ మెట్టు సాయి కుమార్, గౌరవ మత్స్య శాఖ రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ ఖదీర్, గౌరవ డిప్యూటీ డైరెక్టర్ పూర్ణిమ, గౌరవ శేరిలింగంపల్లి డీసీ ప్రశాంతి గార్ల తో కలిసి చెరువులోకి వదిలిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మత్స్య శాఖ రంగారెడ్డి జిల్లా ప్రభుత్వం తరపున ఉచితంగా 100 శాతం సబ్సిడీ పై పంపిణీ చేసిన చేప పిల్లలను దుర్గం చెరువు లో విడుదల చేయడం జరిగినది అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు ఒక వరమని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ,మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. నీలి విప్లవం సాధనలో భాగంగా నీలి తెలంగాణ సాధనకై ముందుకు అడుగులు వేయడానికి ఎంతగానో దోహదపడుతుంది అని దానిలో భాగంగా ఉచిత చేపలు పంపిణి చేసి మత్స్య కారులను ఆదుకుంటుందని ,మత్స్య కారుల జీవితాల్లో వెలుగును నింపుతున్నారని,రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు . అదేవిదంగా ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోని సామాజిక బాధ్యత చెరువులను పరిరక్షించాలని ,చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ,నియోజకవర్గంలోని అన్ని చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 64 చెరువులను సుందరికరణ చేయడం జరుగుతుంది అని, దశల వారిగా అన్ని చెరువులలో చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుంది అని, మత్స్యకారులలో జీవితాలలో వెలుగులు నింపుతామని ,మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో , గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ ప్రెసిడెంట్ సురేందర్ కుమార్ , మరియు సభ్యులు శ్రీశైలం, నరేందర్, అశోక్, సురేష్ , వీర స్వామి,విరస్వామి,భిక్షపతి, ఉదయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


