సిపిఐ డిండి మండల కార్య దర్శి శ్రీరామదాసు కనకా చారి.
డిండి (గుండ్లపల్లి) మే 22 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి అధికారులను కోరారు.గురువారం సిపిఐ డిండి గ్రామ శాఖ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కనకాచారి మాట్లాడుతూ… వర్షాల కారణంగా రైతుల ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో లారీల సంఖ్యను పెంచి త్వరతగతిన కొనుగోళ్లు చేయాలని, తడిసిన ధన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు.
సిపిఐ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, స్థానిక సంస్థల నేపథ్యంలో బరిలో నిలిచేలా క్యాడర్ సమయాత్తం కావాలని సూచించారు.ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి దుబ్బ లక్ష్మారెడ్డి,మండల కార్యవర్గ సభ్యులు హనుమండ్ల కేశవులు,నూనె వెంకటేశ్వర్లు,సినియర్ నాయకులు సలీమ్,లింగమయ్య,శాఖ సహాయ కార్యదర్శులు గోవర్ధన్,తవిటి సైదులు,సాగర్,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


