CPI Mahasabha : జూన్ 10న,జరిగే సిపిఐ డిండి మండల మహాసభను జయప్రదం చేయండి

TRINETHRAM NEWS

సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి
డిండి (గుండ్ల పల్లి) మే 22 త్రినేత్రం న్యూస్. జూన్ 10న,డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )డిండి మండల మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి తెలిపారు.బుధవారం రాత్రి ఖానాపూర్ గ్రామశాఖ మహాసభకు మండల కార్యదర్శి కనకాచారీ,సహాయ కార్యదర్శి తిప్పర్తి విజేందర్ రెడ్డి లు హాజరై మాట్లాడుతూ…
ప్రజా పాలనలో ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను,ఆరు గ్యారంటీలను అమలు చేయాలనీ అన్నారు. సిపిఐ మండల మహాసభను ఖానాపూర్ గ్రామంలో నిర్వహించేందుకు పార్టీ కార్యవర్గం ఏకాభిప్రాయం తెలిపినందున మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మహాసభ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ సభ్యులు తాటికొండ జమ్ములు,కొత్తగోళ్ళ జంగయ్య, దామోదరాచారీ,నిరంజన్, చిన్న జంగయ్య,తాటికొండ శ్రీను,హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Make the CPI Dindi

You cannot copy content of this page

Scroll to Top