డిండి (గుండ్లపల్లి) మే 13 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా అవసరాలను, మరియు ప్రజల సమస్యలను ఎలిగేత్తి చూపి ప్రభుత్వాలచే పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా, పాత్రికేయ రంగంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వడ్త్యా రమేష్ నాయక్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వేతనం లేకపోయినా ప్రజాహితం కోసం జర్నలిస్టులుగా ఎంచుకున్న వృత్తి కోసం పాటుపడుతూ సమాజంలో గౌరవం తప్ప ప్రభుత్వం వారికి ఎలాంటి పథకాలు జీవన వృద్ధి కల్పించకపోవడం మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు జీవనం సాగించాలంటే ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని ఆయన అన్నారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డు లు అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులలో చలామణి అయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను అందించి ఇందిరమ్మ ఇండ్లు ,రాజీవ్ యువ వికాసం పథకాల్లో, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


