తేదీ : 24/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గ్రామం లో ఉన్నటువంటి నేలటూరి వెంకట అప్పారావు కుటుంబం వాళ్ల ముత్తాత, తాతల నుండి గత నాలుగు తరాలు, వంద సంవత్సరాలు నుండి పుట్టి పెరగడం జరిగింది. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంధువుల కుటుంబాలు అందరూ కూడా వీరి కుటుంబంతో ఆప్యాయత, అనురాగం, ప్రేమాభిమానాలతో వాళ్ల ఇంటికి వీళ్ళు, వీళ్ళ ఇంటికి వాళ్ళు రాకపోకలు జరిగాయి.
శుభం మరియు అశుభం, పిక్నిక్ లాంటి కార్యక్రమాలకు ఒకరినొకరు పిలుచుకోవడం, వెళ్లడం, మంచి చెడులు మాట్లాడుకోవడం, ఎవరికైనా సుస్థి చేస్తే వాళ్లను పరామర్శించి ధైర్యం చెప్పేవాళ్లు. తనకి ఇద్దరు సోదరులు ఒకరు నేలటూరి పార్థసారథి, మరొకరు నేలటూరి . మోహన్ రావు. అయితే అప్పారావు గత ప్రభుత్వంలో తన స్వయంకృషితో జీలుగుమిల్లి గ్రామపంచాయతీకి మాజీ ఉప సర్పంచ్ గా గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూసిన ఘనత ఆయనది. కానీ కొంతమంది అవినీతిపరులు ఆయనను అడ్డుకోవడం జరిగింది. తన చిన్న సోదరుడు మోహన్ రావు మండలానికి ఓ రాజకీయ పార్టీకి నాయకత్వం వహించి , అష్ట కష్టాలు ఎదుర్కొని, పేదల కోసం జైలు జీవితం గడిపి, ప్రజాసేవ చేసినటువంటి రోజులు ఉన్నాయి అని చెప్పవచ్చు.
ఏ పార్టీ మద్దతు లేకుండా పంచాయతీలో ప్రజా ప్రతినిధిగా స్వచ్ఛందంగా గెలిచిన విషయం తెలిసిందే. తన కుటుంబంలో మూడింట ఒక వంతు ప్రజలకు ఈ రామ లక్ష్మణుల లాంటి అన్నదమ్ములే ఇళ్ల స్థలాలు,స్థిర నివాసం ఏర్పాటు చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అనేక సమస్యలపై నిరాహార దీక్షలు, ర్యాలీలు , ధర్నాలు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన ఘనత వీరిది. దాని ఫలితమే ప్రజాక్షేత్రంలో విజయ సారుదులుగా నిలవడం గొప్ప విశేషంగా భావించవచ్చు. కానీ కులం లోని కొంతమంది స్వార్థపరుల శక్తుల ముందు గెలవలేక పోతున్నారు.
ఈ స్వార్ధపరుల శక్తుల వల్లే నేలటూరి వెంకట అప్పారావు కుటుంబాన్ని వెలివేయడం జరిగింది. కంప్యూటర్ కాలములోనూ కులం పేరుతో వీళ్లు పెడుతున్నటువంటి కట్టుబాట్లు , మరియు చేస్తున్న కుట్రలు సమాజంలో ఇది సిగ్గుపడవలసిన విషయం. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ విషయం అప్పారావు, మోహన్ రావుకు తెలిసిన వెంటనే పరిష్కార దిశగా ఎల్లప్పుడు ముందు ఉండి నడిపించేవారు. ప్రజల కళ్ళల్లో వాళ్ల కుటుంబంలో వె లుగును నింపారు. ఈ ఇద్దరు సోదరులను గుర్తించి బంధువులు, ప్రజలు పెద్దమనిషి తరహాలో వీళ్లను చూడడం జరిగింది. ఏ కార్యక్రమాలకైనా ఈ ఇద్దరు సోదరులు ముందుండి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు, లేకుండా, రాకుండా చూసుకోవడం జరుగుతూ ఉండేది.
వీళ్లకు మంచి పేరు, మంచి హోదా చూసి తట్టుకోలేక ఎలాగైనా రామ లక్ష్మణ లాంటి సోదరులను విడగొట్టి కుటుంబాలను నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నారు వేరే ప్రాంతం నుండి బ్రతుకుదెరువు కోసం జీలుగుమిల్లి గ్రామానికి వచ్చినటువంటి కొందరు సైకో వ్యక్తులు. వివరాల్లోకి వెళ్తే సుమారు గత ఇరవై సంవత్సరాలుగా కుక్కునూరు మండలం, కొండపల్లి గ్రామానికి చెందిన పాముల .ప్రసాద్ (జర్నలిస్టు), బుట్టాయిగూడెం మండలం, దొరమామిడి గ్రామానికి చెందిన గడ్డం. రామదాసు, గడ్డ. ,జనార్ధన్, గడ్డం.వీరబాబు, గడ్డం. నరసింహారావు (పండు), టి .నర్సాపురం మండలం, బొర్రంపాలెం గ్రామానికి చెందిన జెట్టి. రామకృష్ణ (జర్నలిస్టు), జెట్టి.సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , దుమ్ముగూడెం సమీపంలో ఉన్నటువంటి రేగు బల్లి గ్రామానికి చెందిన శఠగోపం. నరసింహారావు. పై వ్యక్తులు
ఈ గ్రామానికి వచ్చి స్థిరపడి అన్ని సమకూర్చుకూని కుళ్ళు, స్వార్థం , కుతంత్రాలతో రామలక్ష్మణుల వంటి సోదరుల కుటుంబాలను విడదీసి, అదేవిధంగా అప్పారావు కుటుంబాన్ని వెలివేసాము అని దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులకు, ప్రజలకు తొమ్మిది మంది వ్యక్తులు అందరిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మీరు అప్పారావు మోహన్ రావు కుటుంబాన్ని ఏ శుభం మరియు అశుభం పిక్నిక్ వంటి కార్యక్రమాలకు పిలిచిన మిమ్మల్ని ఆ కుటుంబానికి పట్టిన గతి మీ కుటుంబాలకు పడుతుందని ఒక సైకో లాగా హెచ్చరించారు. అప్పటినుండి అప్పారావు కుటుంబం లో ఏ కార్యక్రమం జరిగిన చెప్పుకోవడానికి బంధువులు, ప్రజలు దూరమైపోయారు.
వారి కుటుంబంలో జరిగిన ఏ కార్యక్రమాలకైనా ఈ కుటుంబాన్ని పిలవడం లేదు. ఈ విధంగా పై వ్యక్తులు జీలుగుమిల్లి గ్రామంలో స్థిర పడినప్పటి నుండి ఇలా జరుగుతుంది. అప్పారావు వాళ్ల వేధింపులు భరించలేక మానసిక క్షోభ,తో ఆరోగ్యం క్షేనించింది. ఈయనకు బిపి షుగర్ వంటి వి ఉన్నాయి. పిరికివాడు మాత్రం కాదు. కానీ పై వ్యక్తుల నుండి తన కుటుంబానికి, తన సోదరుల కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు.
లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఆ తొమ్మిది మంది వ్యక్తులకు భయపడలేదు. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండడం మంచిదని వేరే ప్రాంతానికి వెళ్లి జీవిస్తున్నాడు. తన సోదరుడు రాముడి లాంటి అన్నను చూడడానికి అప్పుడప్పుడు స్వగ్రాహానికి వచ్చి నేనున్నాను భయపడుకు అని ధైర్యం చెప్పి మళ్లీ ఆయన ఉండే ప్రాంతానికి వెళ్లడం జరుగుతుంది.
ఈనెల పద్ధెనిమిది వ తేదీన అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇరవైఒకటి వతేదీన మండల తహసిల్దారు కార్యాలయంలో కుల పెద్దలు మరియు అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ తో వినతి పత్రం అందజేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ఇలాంటి కుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవలసిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజాక్షేత్రంలో గెలిచిన ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. అధికారులు సరైన సమయంలో స్పందించకుంటే తీవ్రస్థాయిలో నష్టం జరిగే పరిస్థితి కనబడుతుంది.
నిదానమే ప్రధానం కానీ ఇటువంటి విషయాల్లో ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుందని ప్రభుత్వం తీసుకోవాలి. నేలటూరి. వెంకట అప్పారావు కుటుంబ వెలువేత పై సమగ్ర విచారణ జరిపి పై తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని , నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండు ఇస్తున్నారు. తక్షణమే వెలివేసిన నేలటూరి. వెంకట అప్పారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు మరియు ప్రజలు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


