దేవరకొండ డివిజన్ అక్టోబర్ 30 త్రినేత్రం న్యూస్. మొంథా తుఫాన్ వల్ల నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాలలో విపరీతమైన తుఫాన్ రావడం వల్ల వరి పంటలు పత్తి వివిధ రకాల పంటలు నష్టపోవడం జరిగింది మరియు పశువులు గొర్రెలు ఎల్మేకలు చనిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న నష్టం జరిగిన రైతుల అందర్నీ గుర్తించి వారికి నష్టపరిహారం కచ్చితంగా చెల్లించాలని ఎమ్మార్పీఎస్ – టీఎస్ చందంపేట మండల అధ్యక్షులు అందుగుల సైదులు మాదిగ డిమాండ్ చేశారు.
అదేవిధంగా వివిధ మండలాలలో వరదలు భీభత్సంగా రోడ్లమీద రావడం వల్ల రవాణా దారులు ఎక్కడికక్కడే కొట్టుకపోవడం జరిగింది. ప్రజలు ఊర్లో నుండి బయటికి వెళ్లాలంటే వెళ్లకుండా రహదారులు కొట్టుకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున రాకపోకలు ఎక్కడైతే నిలిచిపోయావో అక్కడ వెంటనే పనులు జరిపించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన అభివృద్ధి నోచుకోలేదు నల్గొండ జిల్లా కనీసం మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను అధికారులు గుర్తించి నష్టపరిహారం వారి అకౌంట్లో డిపాజి ట్ చేయాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


