MLA Nenavat Balu Naik : కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం

TRINETHRAM NEWS

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి.

మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదిగి మరో 10 మందికి ఉపాధి కల్పించాలి.

మహిళల పేరు మీదే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల జారీ..

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఆత్మస్థైర్యానికి అందమైన ఆరంభం..!! ఇది మా ప్రజా ప్రభుత్వ సంకల్పం.!!!

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ జులై 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని,మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ చేశారు.
ఆయన మాట్లాడుతూ….
పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు.. మహిళల సాధికారత, పేదలకు న్యాయం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయాలకు అతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తయేలా ప్రతి వారం బిల్లుల చెల్లింపుతో నిధుల మంజూరు చేస్తున్నాము.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు అందింస్తున్నారు అని అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆడబిడ్డల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా మహిళా సమాఖ్య సంఘాలకు ఆర్థిక సహాయం. వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ భీమా, ప్రమాద చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు.

వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టిందని, మహిళల చేతిలో డబ్బులు ఉండాలని మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మహిళా సంఘాల నాయకురాలు,మహిళా సంఘాల అధికారులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The goal of the

You cannot copy content of this page

Scroll to Top