Supari’s Rule : తాటిమాకులపల్లెలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ సూచనల మేరకు పెనుమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో గురువారం తాటిమాకులపల్లి గ్రామపంచాయతీ అత్తిమాకులపల్లి నందు జరిగింది.

క్లస్టర్ ఇంచార్జ్ తలారి రెడ్డప్ప, బీసీ సెల్ అధ్యక్షుడు అశోక్, చిరంజీవి, రాజగోపాల్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి సవివరంగా ప్రజలకు వివరించారు.ప్రజలలో ప్రభుత్వo పై ఉన్న సానుకూలతను సంతోషాన్ని గ్రామాల్లో ప్రజలు వ్యక్తం చేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The first step program

You cannot copy content of this page

Scroll to Top