The first company established in Ramagundam Industrial Area
తరలిపోకుండా కాపాడండి – జెన్కో అధికారులతో కందుల సంధ్యారాణి
జెన్కో అధికారులు సివిల్ డైరెక్టర్ అజిత్, ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానందం లను కలిసి
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం జెన్కో సంస్థ ఎట్టి పరిస్థితుల్లో మూసివేసి ఇక్కడి నుండి తరలించవద్దు అని విజ్ఞప్తి పత్రాన్ని కందుల సంధ్యారాణి అందజేశారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జెన్కో పరిశ్రమను రామగుండంలో మూసివేయడం వల్ల 300 ఉద్యోగుల కుటుంబాలే కాకుండా స్థానిక వ్యాపారాలు, పాఠశాలలు, రవాణా లాంటివి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. జెన్కో అంటేనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఏర్పడడానికి ఒక మూల స్తంభం. ప్రజలకు ఇది ఒక ఎమోషన్. జెన్కో లేకుండా రామగుండాన్ని ఊహించలేము. నిపుణులు చెప్పినట్టు ఒక 10 కోట్లు మరమ్మత్తులకు, యంత్రాలకు కేటాయిస్తే ఇంకో 5 ఏళ్లు ఫ్యాక్టరీ నడిచే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ సంస్థ పెడతామని హామీ ఇచ్చిన సందర్భంగా ఆలోపు జెన్కో ని నడిపిస్తే కంపనీ కి, ఉద్యోగులకు, స్థానిక వ్యాపారులకు, ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియపై దృష్టి పెట్టి రామగుండం ఉద్యోగులు, ప్రజలకు త్వరిత న్యాయం చేయవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశాను అని తెలియజేశారు. తదనంతరం జెన్కో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కందుల సంధ్యారాణి కి పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్, బిజెపి నాయకులు బరుపాటి నారాయణ, కూర వెంకటేష్, తిప్పని కుమార్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App