త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారిపై వేంచేసి ఉన్న ధనలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం రాత్రి ఈ అమ్మవారి జాతరను తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా కాల్పులతో ఈ జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆలయ కమిటీ చైర్మన్,ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.నిత్యం రద్దీగా ఉండే నాలుగులైన్ల జాతీయ రహదారి పక్కన ఈ ఉత్సవం జరుగుతుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ లు తమ సిబ్బందితో దగ్గరుండి బందోబస్తు నిర్వహించారు. అలాగే శుక్రవారం ఉదయం నుంచి తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది.పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


