జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 7.57.36 PM

TRINETHRAM NEWS

ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర అభివృద్ధిని 30ఏళ్లు వెనకు నెట్టారు

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు పిట్టలవానిపాలెం మండలం లోని సంగుపాలెం, కోడూరు, కోమలి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు ఇస్తు వారికీ చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ.

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ..

కేవలం రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర అభివృద్ధి ని 30సంవత్సరాలు వెనుకకు నెట్టారన్నారు

వైసిపీ అరాచక పాలన పై ప్రజలు తిరగబడెందుకు సిద్ధం గా ఉండాలన్నారు

రాబోయే ఎన్నికలో వైసిపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు

రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ సియమ్ గా చంద్రబాబు రావాలన్నారు

ప్రతి ఇంటింటికి తిరిగి నూతన సంవత్సర క్యాలెండర్ ఇచ్చి ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలిపారు

అనంతరం పిట్టలవానిపాలెం మండల తెలుగుమహిళ అధ్యక్షులు సౌపాటి గ్లోరీ ఆనియట్ పిట్టలవానిపాలెం మండలంలోని సుమారు 70 చర్చిలోని క్రిస్మస్ కేకులు అందచేయటం పట్ల ఆమెకు అభినందనలు తెలిపారు

ఈ కార్యక్రమం లో పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page