ఆగస్ట్ 16, 2026

WhatsApp Image 2024 01 27 at 8.11.25 PM

TRINETHRAM NEWS

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం….
జనసేనలోకి తోట చంద్రశేఖర్, వైసిపి లోకి రావెల కిషోర్ బాబు…!!??

త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ..!!

గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్న తోట చంద్రశేఖర్..

గుంటూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి పోటీ చేసే ఆలోచనలో తోట చంద్రశేఖర్..

గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు, 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీలకి పోటీ చేసిన తోట చంద్రశేఖర్

ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న తోట చంద్రశేఖర్.. త్వరలో టిఆర్ఎస్ గుడ్ బై చెప్పనున్న తోట..?

పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలన్న ఆలోచనలో టిడిపి..

టిడిపి జనసేన లతో సన్నిత సంబంధాలను కొనసాగిస్తున్న తోట చంద్రశేఖర్.. తోట చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్న టిడిపి జనసేన కార్యకర్తలు..

ఆర్థికంగా బలమైన వైసీపీ అభ్యర్థి రజనీకి చెక్ పెట్టేందుకు.. జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్న ఇరు పార్టీలు….
బి ఆర్ఎస్ పార్టీకి చెందిన మరో నేత రావెల కిషోర్ బాబు త్వరలో వైసీపీకి జంప్ అవ్వనున్నట్లు ముఖ్య ఆంతరంగికుల సమాచారం గా తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే కాస్తో కూస్తో ఆంధ్రలో సెటిల్ అవుదామనుకున్న బి ఆర్ ఎస్ పార్టీ తట్టా బుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి.

ఈనెల 30వ తేదీన రావెల కిషోర్ బాబు జగన్ సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

వేరు వేరు పార్టీల్లో చేరనున్న ఏపీ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు..

You cannot copy content of this page