విద్యుత్ ఘాతంతో మృతి చెందిన అజయ్ కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలి
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి
దేవరకొండ జులై 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం సమైఖ్య నగర్ కాలనీకి చెందిన కూన అజయ్ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు.గొల్లపల్లి గ్రామం సమైక్య నగర్ లో విద్యుత్ ఘాతంతో మృతి చెందిన అజయ్ మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యుత్ ఘాతంతో మృతి చెందిన అజయ్ కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవాలి ఆయన కోరారు.అజయ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్నిప్రార్థించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


