నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఆయన స్థానిక నాయకులు సదస్సు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్సే అన్నారు. అందుకు కృతజ్ఞత గానే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్షల మీదకే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్ సి సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


