త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జులైలో సిపిఐ జిల్లా మహాసభలు…. కాకినాడ,బుధవారం,21: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక ఎస్టియు కార్యాలయంలో టి అన్నవరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ రావు, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తాటిపాక మధు లు హాజరయ్యారు. ముందుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ ఇటీవలే మృతి చెందిన దేశ రక్షణ సైనికులకు, హైదరాబాదులో షార్ట్ సర్క్యూట్ లో మృతి చెందిన వారికి,పార్టీ సానుభూతిపరులకు, అమరవీరులకు సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా డేగ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పాకిస్తాన్ తీవ్రవాదులు మత కలాలను సృష్టించడం కొరకు కాశ్మీర్లో హిందువులను టార్గెట్ చేసి చంపడాన్నే సిపిఐ గా ఖండిస్తున్నామని, శత్రు సైన్యాన్ని మెడలు ఉంచడంలో భారత్ కీలకపాత్ర పోషించిందని, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర వాదుల స్థావరాలపై భారత్ దాడి హర్షించదగిన విషయమే అని ఆయన అన్నారు. అర్హులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల మంజూరు చేసే వరకు సిపిఐ పోరాట ఉద్యమం ఆగదని, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు భూమిని, అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు భూమిని మంజూరు చేసి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, జూన్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలపై ఆందోళన నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తాటిపాక మధు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉంటుందని, ప్రజల శ్రేయస్సుకై నిరంతరం పోరాట ఉద్యమలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని, వందేళ్లు నిండిన సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా వాడ,వాడలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పార్టీ జాతీయ, రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో శాఖ, మండల, నియోజకవర్గ, పట్టణ మహాసభలు నిర్వహించి జులై నెలలో15, 16 తేదీలలో సామర్లకోటలో కాకినాడ జిల్లా సిపిఐ జిల్లా మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, సిపిఐ సభ్యత్వం కలిగిన ప్రతి పార్టీ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఈ మహాసభలకు తీసుకురావాలని ఆయన అన్నారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు కై వృద్ధులకు,వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్లు ఎంక్వయిరీ చేసిందని, ఎంక్వయిరీ పేరుతో ఇప్పటికే మంజూరు చేస్తున్న పెన్షన్ లు రద్దు చేస్తే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబడతామని చేపడతామని ఆయన అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ కార్య కార్యకలాపాల నివేదికను తెలియజేశారు. ఈ సమావేశంలో పెద్దిరెట్ల సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, పెద్దిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


