Press Club : అరకులోయలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎంపిక

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 22: అరకులోయ, అంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీ యు డబ్ల్యు జె) విశాఖ ఉమ్మడి జిల్లా రూరల్ అధ్యక్షులు స్వామి సమక్షంలో అరకులోయ లో స్థానిక అక్షయ ఇన్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో డుంబ్రిగూడ, అనంతగిరి, అరకులోయ ప్రాంతాలకు చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సుమారు 60 మంది హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు స్వామి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మూడు మండలాలకు చెందిన ప్రెస్ క్లబ్ కార్యవర్గాల ఎన్నికలు చేపట్టారు.
అరకు వ్యాలీ మండల అధ్యక్షుడిగా ఎల్బీ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్. రవి, ఉపాధ్యక్షులుగా డి. గోవర్ధన్, ఇతర సభ్యుల ఎంపిక కూడా జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అరకు వ్యాలీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, “మీడియా మిత్రులు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. కొన్ని అపోహల వల్ల వేరే వేరుగా కార్యవర్గాలు ఏర్పడటం బాధాకరం. అందరం ఐక్యంగా ఉంటే మీడియా వర్గానికి ఎంతో మేలు జరుగుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనంతగిరి, డుంబ్రిగూడ మండలాల మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మూడు మండలాల పత్రికా ప్రతినిధుల ఐక్యతను ప్రతిబింబించే ఈ సమావేశం, స్థానిక మీడియా రంగంలో కొత్త మార్గదర్శకంగా నిలవనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Press Club in Araku Valley

You cannot copy content of this page

Scroll to Top