Kandula Durgesh : దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి కందుల దుర్గేష్

TRINETHRAM NEWS

బిక్కవోలు:త్రినేత్రం న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీకి భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని, మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,

పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న ధర్మ యుద్ధంలో భాగంగా భారత సైనికులకు, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి భగవంతుని ఆశీస్సులు దైవ బలం మెండుగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రాచీన ఆలయాల్లో మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో భాగంగా బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయం, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిడదవోలు నుంచి రెండు ప్రత్యేక బస్సుల్లో జన సైనికుల తో కలిసి మంత్రి దుర్గేష్ బిక్కవోలు చేరుకున్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి బిక్కవోలు ప్రాచీన ఆలయాల్లో స్వామివారిలను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పూజలు అనంతరం జాతీయ పతాకాలు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షణ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The country is proud

You cannot copy content of this page

Scroll to Top