త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో గత పది రోజులుగా రాజుపేట యూత్ ఆధ్వర్యంలో ములకలపల్లి హైస్కూల్ లో రాజుపేట సూపర్ లీగ్ ను నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భాగంగా అంకంపాలెం, ఒడ్డురామవరం జట్లు పోటీ పడగా అంకంపాలెం జట్టు గెలిచి రాజుపేట సూపర్ లీగ్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచింది.
అయితే గెలిచిన అంకంపాలెం జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రీడాకారుడినీ అభినందించి మొదటి బహుమతిని వారికి అందించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ మరియు ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు దుగ్గి సంపత్, పైడి సాయి,వేలకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


