తేదీ : 21/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్)); అశ్వరావుపేట నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీలు తిరుమల కుంట, కొత్తమామిళ్ల వారి గూడెం, రెడ్డిగూడెం, కాంగ్రెస్ పార్టీ నాయకులు , అధ్యక్షులు వీర్నాల. శ్రీనివాసరావు, కొమ్ము రెడ్డి, గడ్డం. యేసు, రామినేని. సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది అని తెలిపారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, సన్నబియ్యము, మహిళలకు ఉచిత ప్రయాణం గురించి వివరించి చెప్పారు.
ఇంతకన్నా ఇంకేమి కావాలి అని సంతోషాన్ని వ్యక్తపరిచారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన అధిక మెజార్టీతో ఈ ప్రభుత్వం గెలుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిచ్చిందని అనడం జరిగింది. శాసనసభ్యులు జారే. ఆదినారాయణ నాయకత్వం , మండలంలో జూపల్లి. రమేష్ నాయకత్వం కూడా వర్ధిల్లాలి సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మేము చేసే పరిష్కారం మేము చేస్తున్నాము, లేనిపక్షంలో ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


