టిడిపి నాయకుడివా… వీధి రౌడీవా…!
కమీషనర్ తీరు పై ఎమ్మెల్సీ తోట ఆగ్రహం….
పలు సమస్యలపై…
పుర కార్యాలయం ముట్టడికి యత్నం…
కార్యాలయం లోనే అడ్డుకున్న పోలీసులు…
వైసిపి కార్యకర్తలు నిరసన…
డీఎస్పీ రఘువీర్ హామీ తో ఆందోళన విరమణ…
తీవ్ర ఉద్రిక్త వాతావరణం….
త్రినేత్రం న్యూస్, మండపేట: మండపేట పుర పాలక సంఘం కమిషనర్ టివి రంగారావు పై రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మెన్, మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మండపేట వైసీపీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండపేట మున్సిపాల్టీ లో నెలకొన్న పలు సమస్యలపై ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు ఇచ్చారు.
ఈక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో విజయ లక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, పుర పాలక సంఘం కార్యాలయ ముట్టడి కి బయలుదేరారు. ఈ నేపద్యంలో టౌన్ సి ఐ సురేష్, రూరల్ సి ఐ దొర రాజు లు పోలీసులు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. శాంతి భద్రత సమస్య తలెత్తుతుందనీ ఇక్కడ నుండి వెళ్లకూడదని అడ్డుకున్నారు.
వారి తో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ డాక్టర్ బి అర్ అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం తను హక్కులు ప్రశ్నిస్తుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. తాను లేవనెత్తిన సమస్యలు ప్రజల కోసం అని పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో నిలువ నీడ లేని రిక్షా కార్మికులకు బస్ స్టాండ్ లో షెల్టర్ నిర్మిస్తే అక్కడ ఉన్న బోర్డు కమీషనర్ టివి రంగారావు అన్యాయం గా తొలగించారని ఆరోపించారు. అక్కడ బోర్డు పై మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో తో ఉన్న బోర్డు స్థానం లో టీడీపీ బోర్డు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
దీనిపై పలు మార్లు ఫిర్యాదు చేసినా కమీషనర్ తీరు మారలేదని తప్పుపట్టారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రాము కు చెందిన భవనాన్ని అక్రమంగా కూల్చే యత్నం కమీషనర్ చేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకుడివా, లేదా వీధి రౌడీవా అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పాటి మీద అన్ని అనుమతులు తో వైసిపి నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే దౌర్జన్యంగా తొలగించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఆగడాలు విపరీతంగా పెరిగి పోయాయని విమర్శించారు. వల్లూరు లో అక్రమ చెరువులు తవ్వి మట్టి నీ తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయని
విమర్శించారు. సంబంధిత అధికారులు ఏమైపోయారని తోట ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వం లో ఇటువంటి అరాచకాలు లేవన్నారు. విలువైన మున్సిపాల్టీ వాటర్ వర్క్స్ స్తలం కబ్జా కు గురైతే కమీషనర్ ఆ కబ్జా ను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు కమిషనర్ వ్యవహారం, కొనసాగుతుందని గుర్తు చేశారు. దీనికి బాధ్యత వహించి వెంటనే కమిషనర్ను సస్పెండ్ చేయాలని తోట ఉద్ఘాటించారు.
టిడిపి కి తొత్తుగా వ్యవహరించి ప్రోటోకాల్ పాటించడం లేదని కమీషనర్ తీరు ను దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు కమిషనర్ పేరుపై ఉన్నతాధికారులు స్పందించకపోతే వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని పేర్కొన్నారు. కనీసం శిలాఫలకాలు పై కౌన్సిలర్ ల పేర్లు కమీషనర్ వేయడం లేదని పేర్కొన్నారు. రేషన్ అక్రమ రవాణా కు అంతూ పొంతూ లేకుండా ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఎవరికి అమ్మాలి ఏ రైస్ మిల్లుకు పంపాలో అన్నది కూడా ముందుగానే డీలర్లకు చెప్పి మరి రైసును రవాణా చేయడం ఇంతకంటే దారుణం ఉంటుందని తోట ప్రశ్నించారు. కొందరు రేషన్ డీలర్ లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
అనంతరం కార్యాలయం నుండి పోలీసులు అడ్డుగిస్తున్న రోడ్ పైకి వచ్చారు. పోలీసులు ఆయన ను అరెస్ట్ చేసి జీపులో తీసుకొని వెళ్లాలని తీవ్ర యత్నం చేశారు. కార్యకర్తలు ఆయన కు వలయం లా ఏర్పడి పోలీసులు ప్రయత్నాన్ని అడ్డు కొన్నారు. అక్కడే లాగులాట జరిగింది. పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపద్యంలో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ అక్కడికి చేరుకున్నారు. సెక్షన్ 21 అమలు లో ఉందని ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని తోట కు తెలిపారు.
పలు అంశాలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు లేవనెత్తారు. కాగా 15 రోజుల వ్యవధి లో అధికారులతో మాట్లాడి చట్ట ప్రకారం సమస్యల పరిష్కార కోసం కృషి చేస్తానని డీఎస్పీ రఘువీర్ హామీ ఇచ్చారు. దీంతో తోట ఆందోళన విరమించి తన కార్యాలయం లోకి వెళ్లిపోయారు. ఈ గడువు లోగా సమస్య పరిష్కారం కావాలని లేని పక్షంలో మునిసిపల్ కార్యాలయ ముట్టడి మహాధర్నా నిర్వహిస్తానని తోట త్రిమూర్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కర్రి పాపారాయుడు ,వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, దూలం వెంకన్న బాబు, ఓగిరాల దేవి, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, మీగడ శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, పెద్దపాటి సత్యనారాయణ, మందపల్లి రవికుమార్ ,వైసిపి నాయకులు, కౌన్సిలర్లు ఎంపీటీసీ లు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


