
CM Revanth : త్రినేత్రం న్యూస్ : కొడంగల్ లో స్థానిక నాయకులు, BLA లతో SIR పై సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే మనకు రాష్ట్రానికి నాయకత్వానికి వహించే అవకాశం వచ్చింది. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు…. రాష్ట్రస్థాయిలో దెబ్బతీయాలంటే పునాదులు దెబ్బతీయాలని చూస్తున్నారు… పేర్లు వేరైనా బీఆరెస్, బీజేపీ రెండూ ఒక్కటే
కొడంగల్ లో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని చూస్తున్నారు…. ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారు… ఎదురు నిలబడలేక దొంగదెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారు…. 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవడంలేదు…. కొడంగల్ లో కుట్రలు చేసేవారిని బొంద పెట్టే బాధ్యత మీపై ఉంది….
ఆగస్టు 3 వరకు SIR గడువు ఉంది… కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో ఇప్పటివరకు 1,96,620 ఓట్లు ప్రక్షాళన అయ్యాయి…. ఇంకా నమోదు చేసుకోనివారి సంఖ్య 54,635… మొత్తం ఓట్లలో ఇంకా 22 శాతం ఇంకా నమోదు జరగలేదు.
ఆ ఓట్లను తొలగిస్తే ప్రమాదం పొంచి ఉంది… వారందరినీ తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఓటు పోగొట్టుకుంటే గుర్తింపు ఉండదు.. కార్యకర్తగా ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ఫారం నమోదు చేయించాలి…. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లు తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
బీజేపీ, బీఆరెస్ ఒక్కటై కాంగ్రెస్ ను దొంగదెబ్బ తీయాలని గూడుపుటాని చేస్తున్నాయి. ఓటర్ల వివరాలు ఎన్నికల అధికారులకు అందించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపైనే ఉంది… ఈ నెల 30 లోగా నూటికి నూరు శాతం కొడంగల్ నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలి… అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోవడానికి వీల్లేదు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe