TRINETHRAM NEWS

The collector orders to fill the canals and repair the roads to prevent water stagnation

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం
జిల్లా పౌర సంబంధాల శాఖ
సాధారణ వర్షపాతానికి రోడ్ల పై నీరు నిలువకుండా నాలాల పూడికలు తీయడమే కాకుండా వర్షపు నీరు వెళ్లే మార్గలను క్లీయర్ చేయాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ విసి హాల్ లో జరిగిన జిల్లా రహదారి భద్రత సమావేశంలో అదనపపు జిల్లా కలెక్టరు రాధికా గుప్తాతో కలిసి కలెక్టరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లు, ట్రాఫిక్, మున్సిపాలిటి, ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టరు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా లోని రోడ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టరు ఆదేశించారు. చిన్నపాటి వర్షానికి రోడ్ల పై నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులకు కలెక్టరు సూచించారు.

జిల్లాలోని ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు సరైన ప్రణాళిక రూపొందించి తద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 19యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని ట్రాఫిక్ ఎసిపి తెలుపగా, వాటికి తీసుకోవలసిన చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ సంవత్సరం జరిగిన ప్రమాదాలు, మరణాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు కారణలైన అధిక స్పీడు, ఇరుకైనరోడ్లు, ట్రాఫిక్ జామ్ వంటి అంశాల పై క్షుణ్ణంగా చర్చించారు. అవసరమైన చోట కల్వర్టులను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రక్కన ఉన్న నాలాలను క్లీయర్ చేసి వర్షం నీరు ఆగకుండా చూడలని మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు.

రహదారుల వెంట వీధి దీపాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. అధిక నిధులు అవసరమైన పనులకు ప్రణాళికలు తయారు చేసి నివేదికలు పంపాలని కలెక్టరు సంబంధిత అధికారులకు ఆదేశించారు. సంబంధిత అధికారులందరు సమన్వయంతో పనులు చేపట్టాలని కలెక్టరు తెలిపారు. జిల్లా రహదారి భద్రతా అనే అంశం పై పాఠశాల విద్యార్థులతో అవగాహాన కార్యక్రమాలను ఏర్పాటు చేసి క్యాంపెయిన్లు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ మల్కాజిగిరి ఏసిపి శ్రీనివాసరావు, ట్రాపిక్ రాచకొండ ఇన్స్పెక్టర్ ప్రదిప్ బాలు, ఎన్ హెచ్ 44 పిడి ఎల్.ఎస్ . రావు, ఆర్ అంఢ్ బి డిఈఈ సరిత, ఏఈఈ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The collector orders to fill the canals and repair the roads to prevent water stagnation