తేదీ : 10/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గన్నవరం నియోజవర్గం రహదారులు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వ చిప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. వెంకట్రావు తెలపడం జరిగింది. యన్ టి ఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలోని సిండికేట్ బ్యాంక్ కాలనీలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు డ్రైనేజీలను సాయంత్రం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సిండికేట్ బ్యాంక్ కాలనీ రామాలయం వీధి యన్ టి ఆర్ పార్కు రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ చివరి ప్రాంతాల్లో వీధిలైట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్పందించడం జరిగింది. క్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలపడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. గ్రామాల్లో బాగోలేని రహదారులు, డ్రైనేజీలు పునర్నిర్మిస్తున్నామని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి నాయకులు, కొ ల్లు. ఆనందకుమార్, పరిశీలకులు వి. హరిబాబు, పి చంటి, గ్రామ సర్పంచ్ యస్. కొండ ఉప సర్పంచ్ నాగరాజు, బి. అరుణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


