IMG 20240828 WA0007
CI who gave counseling to those driving carts without number plates in Vikarabad town. I Nagaraju
Trinethram News : వికారాబాద్ : జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వికారాబాద్ పట్టణ సిఐ ఏ.నాగరాజు పోలీస్ బృందంతో కలిసి వాహనాల నెంబర్ ప్లేట్లు, సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని వాహనాలను నడిపేవారిని, సైలెన్సర్ మార్చి అధిక శబ్దం వచ్చేలా వాహనాలు నడుపుతున్న వారికి ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. నంబర్ ప్లేట్ లేని వాహనదారులకు నంబర్ ప్లేట్లు వేయించారు. మరోసారి నంబర్ ప్లేట్ లేకుంన్నా గాని, వాహనాల సైలెన్సర్ మార్చినా గాని అటువంటి వాహనాలను సీజ్ చేసి ఆర్టిఏ కార్యాలయానికి అప్పచెప్తామని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
